షరపోవాపై కరోలిన్ వోజ్నియా అభ్యంతరం
షరపోవాపై కరోలిన్ వోజ్నియా అభ్యంతరం
ఇండియన్ వేల్స్: నిషేధిత ఉత్ప్రేరకం వాడినందుకు పడిన ఏడాది నిషేదం వచ్చే నెలలో పూర్తి చేసుకోబోతున్న రష్యా టెన్నిస్ తార మరియా షరపోవాను హడావిడిగా స్టట్ గార్ట్ డబ్ల్యూటిఎ టోర్నీలో ఆడించడానికి నిర్వహకులు అంగీకరించడంపై ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్ వోజ్నియా అభ్యంతరం వ్యక్తం చేసింది.ఏప్రిల్ 26న షరపోవాపై నిషేదం నుంచి బయటపడే సమయానికి ఈ టోర్నీ ఆరంభమై ఉంటుందని,డోపిగా తేలి నిషేదం ఎదుర్కొన్న క్రీడాకారిణికి టోర్నీ మధ్యలో ఆడే అవకాశం కల్పించాల్సిన అవసరమేముందని ఆమె ప్రశ్నించింది.దీన్ని ప్రశ్నించాలి. అక్కడున్నదెవరైనా సరే నిషేదం నుంచి బయటపడ్డ క్రీడాకారిణిని టోర్నీ మధ్యలో అనుమతించడమేంటి? ప్రతిఒక్కరికి రెండవ అవకాశం ఉండాల్సిందే.అయితే పునరాగమనం కోసం చూస్తున్న షరపోవా సరైన మార్గంలో పోరాడాలి.డోపీగా తేలి నిషేదం ఎదుర్కొన్న క్రీడా కారిణిగా ఆమె సున్నా నుంచి మొదలుపెట్టాలి అని వోజ్నియాకి కుండబద్దలు కొట్టింది. స్టట్గార్డ్ టోర్నీలో సత్తా చాటి ర్యాంకింగ్ పాయింట్స్ సాధిస్తేనే ఆ తరువాత జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వాలిఫయింగ్ టోర్నీ ఆడేందుకు షరపోవాకు మార్గం సుగమవుతుంది. నిషేధం తరువాత తాను ఆడేందుకు వీలున్న తొలి గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడాలని షరపోవా కోరుకుంటుంది. అయితే ఈ టోర్నీలో షరపోవాకు వైల్డ్ కార్డ్ ఇవ్వడానికి నిర్వహకులు నిరాకరించడంతో స్టట్గార్డ్ టోర్నీ పై షరపోవా దృష్టిపెట్టింది.