శ‌బ‌రిమ‌ల ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తులు

SABARIMALA
SABARIMALA

కేరళః ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం ఈరోజు తెరుచుకుంది. తొలిరోజు స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. మండలం‍‍‍ – మకరవిలక్కు (జ్యోతి దర్శనం) వార్షిక ఉత్సవాల దృష్ట్యా ఆలయాన్ని తెరిచారు. తొలిరోజు ఆలయ ప్రధాన అర్చకుడు మహేశ్ మొన్నరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలం ఉత్సవాలు 41 రోజుల పాటు జరగనున్నాయి. డిసెంబర్ 26న నిర్వహించే మండల పూజతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఆ రోజు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు. తిరిగి డిసెంబర్ 30న మళ్లీ ఆలయాన్ని తెరవనున్నారు. జనవరి 14న జ్యోతి దర్శనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.