శ్రీశాంత్‌కి సుప్రీం కోర్టులో ఊరట

sreesanth
sreesanth


ఢిల్లీ: స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో శ్రీశాంత్‌ జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే.. శుక్రవారం శ్రీశాంత్‌ తరఫున న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ వాదనలు ద్విసభ్య ధర్మాసనం విన్నది. జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, కెఎం జోసెఫ్‌ల ధర్మాసనం శ్రీశాంత్‌ శాశ్వత బహిష్కారంపై మూడు నెలల్లో సమాధానం చెప్పాలని బిసిసిఐని ఆదేశించింది. ఈ విధంగా సుప్రీం కోర్టులో శ్రీశాంత్‌కి ఊరట లభించింది.
సల్మాన్‌ ఖుర్షీద్‌ వాదిస్తూ.. 2013 ఐపిఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవన్నారు. ఒక ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని వాదనలు వచ్చాయనీ, కానీ దాన్లో 13 పరుగులే తీశాడని తెలిపారు. శ్రీశాంత్‌ మ్యాచ్‌ఫిక్సింగ్‌కి పాల్పడలేదని, ఆధారాలు లేకుండా అతనిపై జీవిత కాలం నిషేధం వింధించడం సరి కాదని ఆయన వెల్లడించారు. అంతేకాక, 2018 ఆగస్టులో కేరళ హైకోర్టు బిసిసిఐ నిర్ణయాన్ని త్రోసిపుచ్చినా, బిసిసిఐ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదని వెల్లడించారు. బిసిసిఐ నిషేధం ఎత్తివేస్తే క్రికెట్‌లో పాల్గొనేందుకు శ్రీశాంత్‌ సిద్ధంగా ఉన్నాడని కోర్టుకు ఆయన తెలిపారు.
ఈ విచారణ అనంతరం శ్రీశాంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. బిసిసిఐ తీర్పుపై తనకు నమ్మకం ఉందని, 30 ఏళ్ల వయస్సులో ఇంకా చాలా ఫిట్‌గా ఉన్నానని ఆయన తెలిపారు. బిబిసిఐ తనపై నిషేధాన్ని ఎత్తివేస్తే తిరిగి మళ్లీ క్రికెట్‌లో పాల్గొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని శ్రీశాంత్‌ తెలిపాడు.

తాజా క్రీడా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/sports/