శ్రీ‌శైలo జ‌లాశ‌యానికి వరద ప్రవాహం

 

Srisailam Dam
Srisailam

శ్రీ‌శైల జ‌లాశ‌యానికి వరద ప్రవాహం పోటెత్తింది. జలాశయంకు ఇన్ ఫ్లో 1,44,480 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీ‌శైల జ‌లాశ‌యం నీటిమట్టం 883.10 అడుగులు కాగా, నీటినిల్వ సామర్థ్యం 205.2258 టీఎంసీలు ఉంది.శ్రీ‌శైల జ‌లాశ‌యం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.

శ్రీ‌శైల జ‌లాశ‌యం నుంచి పోతిరెడ్డిపాడుకు 6వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1600 క్యూసెక్కులు విడుదల చేశారు

. శ్రీ‌శైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో 24గంటల పాటు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 7 యూనిట్లద్వారా విద్యుత్ ఉత్పత్తి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 6యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.