శ్రీ‌కాంత్ కిదాంబికి సీఎం చంద్ర‌బాబు ఫోన్‌

CM Chandrababunaidu
CM Chandrababunaidu

అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఏపీకి చెందిన క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ను పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు షట్లర్ శ్రీకాంత్‌కు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. క్రీడారంగంలో విశిష్టసేవలు అందించిన శ్రీకాంత్‌కు పద్మశ్రీ ప్రకటించడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.