శ్రీశైలంకు వ‌ర‌ద ఉధృతి

srisailam
srisailam

శ్రీశైలంః శ్రీశైలం రిజర్వాయర్‌లో వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లోగా 76,574 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రాజెక్టు అధికారులు 14,825 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుతం 878.90 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 188.8 టీఎంసీలు ఉంది.