శ్రీశాంత్… విశ్వాసం కోల్పోవ‌ద్దుః అజారుద్దీన్

AZHAR
AZHAR

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా భారత క్రికెట్ జట్టు నుంచి బహిష్కరణకు గురైన పేస్ బౌల‌ర్ శ్రీశాంత్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మద్దతుగా నిలిచారు. తాజాగా అజార్ ఓ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీశాంత్ భారత జట్టుకు దొరికిన ఓ అద్భుతమైన బౌలర్ అని, అత‌ని కెరీర్ ఇంకా ముగియలేదని, తన కోసం భారత జట్టు తలుపులు అప్పుడే మూతపడలేదన్నారు. జట్టులో స్థానం కోసం ఓపికతో ఎదురుచూడాలని, విశ్వాసం కోల్పోవద్దని సూచించారు.