శ్రీవారి ద‌ర్శ‌నానికి రెండు కిలోమీట‌ర్ల క్యూ

Devotees in tirumala
Devotees in tirumala

తిరుమల: తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి రెండు కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. ఈ రోజు ఇక కొత్తగా వరుసలో చేరొద్దని తితిదే భక్తులకు సూచించింది. ఇప్పుడున్న వారికి స్వామివారి దర్శనం పూర్తవడానికే రేపు ఉదయం వరకు సమయం పడుతుందని పేర్కొంది. ఇప్పుడు కొత్తగా వరుసలోకి వచ్చే వారు.. రేపు ఉదయం 11 గంటల తర్వాత క్యూలైన్‌లోకి రావాలని కోరింది.