శ్రీవారిని దర్శించుకున్న ‘మహానటి కీర్తి సురేష్‌

Keerthi suresh
Keerthi suresh

తిరుమల: మహానటి కథానాయిక కీర్తి సురేష్‌ నేడు తిరుమలను సందర్శించారు. కీర్తి తిరుమల శ్రీవారిని విఐపి విరామసమయంలో దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య సమయంలో స్వామి వారిని దర్శించుకోని మొక్కుల చెల్లించుకున్నారు. తితిదే ఆలయ అధికారులు కీర్తి కోసం ప్రత్యేక దర్శన ఏర్పాటు చేశారు. దర్శనానంతరం కీర్తికి ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించి, స్వామి వారని చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. తదనంతరం కీర్తిని పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, మహానటి సావిత్రి జీవిత చరిత్ర చేయడం చాలా సంతోషంగా ఉందనాఉ. మహానటి సినిమా విజయవంతం కావడంతో స్వామివారి దర్శనానికి వచ్చినట్లు కీర్తి చెప్పారు.