శ్రీవారికి రూ.30 లక్షల విరాళం

balaji
తిరుమల శ్రీవారి నిత్య అన్న ప్రసాద ట్రస్ట్ కు అంబికా గ్రూపు ఎండీ అంబికా కృష్ణ రూ. 30 లక్షల విరాళాన్ని అందజేశారు. బుధవారం ఉదయం తిరుమలలో జేఈవో శ్రీనివాస్ రాజును కలిసి రూ. 30 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం అధికారులు వారికి స్వామి వారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.