శ్రీరెడ్డి పోరాటంపై పవన్‌ స్పందన

PAWAN
PAWAN

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై హీరోయిన్‌ శ్రీరెడ్డి చేసిన పోరాటంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. ఇండస్ట్రీలో ఎవరికైనా అన్యాయం జరిగినపుడు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ,కోర్టుకు వెళ్లాలని అపుడే వారికి పూర్తి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. అన్యాయానికి గురైన వారికి తన మద్దతు ఎపుడూ ఉంటుందని చెప్పారు. టివిలలో చర్చల వల్ల ఏమీ రాదని కొన్ని రోజుల తర్వాత అందరూ మరిచి పోతారని, న్యాయం కూడా జరిగే అవకాశం ఉండకపోవచ్చని తెలిపారు. సెన్సేషన్‌ కోసం కాకుండా ,న్యాయం కోసం పోరాటం చేయాలని చెప్పారు.