శ్రీరెడ్డికి ఎస్ఐఎస్ జెఏసి మ‌ద్ద‌తు

Sri Reddy
Sri Reddy

టాలీవుడ్ లో తెలుగు మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పై ప్రత్యక్ష పోరాటానికి దిగిన హీరోయిన్ శ్రీరెడ్డికి మద్దతు పెరుగుతోంది. శ్రీరెడ్డికి తాము మద్దతుగా ఉంటామని సౌత్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు. జేఏసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, దక్షిణాది సినిమాలలో ఉత్తరాది హీరోయిన్లకు ఎక్కువ ఛాన్సులు ఇవ్వడం వల్ల… దక్షిణాది హీరోయిన్లు నష్ట పోతున్నారని ఆయన తెలిపారు. దక్షిణాది తారల పట్ల సినీ నిర్మాతలు, ఇతరులు ఇదే విధంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.