శ్రీరామనవమి నుంచి ఆలయాభివృద్ధి పనులు: తుమ్మల

Thummala Nageshwara rao
Thummala Nageshwara rao

శ్రీరామనవమి లోపు కొన్ని అభివృద్ది పనులను మొదలుపెట్టి వచ్చే శ్రీరామనవమికి ఆలయ అభివృద్దికి తుదిరూపు కల్పిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం తన నివాసంలో అనందసాయి అర్కిటెక్‌ బృందంతో భద్రాద్రి ఆలయ నమూనాలు పరిశీలించిన మంత్రి రాబోయే రెండురోజుల్లో ముఖ్యమంత్రితో తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన భధ్రాచలం ఉన్న శ్రీసీతారామస్వామి వారి ఆలయ అభివృద్ది పథకంలో భాగంగా అర్కిటెక్ట్‌ ఆనందసాయి సారథ్యంలో మూడు నమూనాలు తయారు చేయించారు. ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి దివ్య ఆశిస్సులతో ఈ మూడు నమూనాలు చక్కగా కుదిరాయని, వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి..ముఖ్యమంత్రి సమక్షంలో తుదినిర్ణయం తీసుకుంటామని నాగేశ్వరావు తెలిపారు.