శ్రీరాజరాజేశ్వరీదేవి

నేటి అలంకారం

(విజయవాడ కనకదుర్గ అమ్మవారు)

SRI RAJA RAJESWRAI1
SRI RAJA RAJESWRAI1

శ్రీరాజరాజేశ్వరీదేవి

” అంబారౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీవైష్ణవీ బ్రహ్మాణీత్రిపురాంతకీ సురనుతాదేదీప్యమానోజ్జ్వలాచాముండాశ్రిత రక్షపోషజననీ దాక్షాయణీ పల్లవి చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ దసరా ఉత్సవాలలో దశమి తిధిన అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి చివరి రూపం శ్రీరాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండాలకు ఈమె ఆరాధ్యదేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. ఈమెను ‘అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది.

ఈమె స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. కోటి సూర్య సమప్రభ. కోటి సూర్యులను ఒకసారి ఒకేచోట చేర్చినంత ప్రకాశవంతంగా ఈ తల్లి వెలుగొందుతుంటుంది. పరమేశ్వరుడి వామఅంకం ఈమెకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత పూరితమైన మానవ మనోచైతన్యాన్ని శ్రీరాజరాజేశ్వరీదేవి ఉద్దీపితం చేసి, మోక్ష కైవల్యాన్ని కలిగిస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈమె అధిష్టాన దేవత. అలంకారం: ఆకుపచ్చ వర్ణం లేదా లేత కనకాంబరం వర్ణం కలిగిన పట్టుచీరతో అలంకరిస్తారు. మంత్రం: ”ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌః సకల హ్రీం అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శ్రీలలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన, సువాసినీ పూజ చెయ్యాలి. వీలైనవారు శ్రీచక్రార్చన చేస్తే మంచిది. నివేదన: అమ్మవారికి లడ్డూలు నివేదన చేయ్యాలి.