శ్రీదేవి మ‌ర‌ణంపై ద‌ర్యాప్తు పిటిష‌న్ కొట్టివేత

SRIDEVI
SRIDEVI

న్యూఢిల్లీః ప్రముఖ నటి శ్రీదేవి మరణంపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టివేసింది. దుబాయిలో బంధువుల వివాహ వేడుకకు హాజరైన సందర్భంలో ఫిబ్రవరి 24న హోటల్ గదిలోని నీటి తొట్టిలో శ్రీదేవి ఊపిరాడకుండా మరణించిన విషయం విదితమే. దీనిపై ఎన్నో అనుమానాలు కూడా వచ్చాయి. శ్రీదేవి అకాల మరణంపై నిర్మాత సునీల్ సింగ్ సందేహాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తాను దుబాయిలోని హోటల్ సిబ్బంది నుంచి, ఆమెను చేర్పించిన ఆస్పత్రి నుంచి, ఇతర వర్గాల నుంచి సేకరించిన సమాచారం, మీడియాలో వచ్చిన దానికి భిన్నంగా ఉందని సునీల్ సింగ్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు కూడా శ్రీదేవి మరణంపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ ను గ‌తంలో కొట్టివేసిన విషయం విదితమే.