శ్రీదేవి మృతికి సంతాపంగా హోలీ సంబ‌రాలు ర‌ద్దు

SRIDEVI
SRIDEVI

దివి నుండి భువికి దిగి వ‌చ్చిన దేవ‌క‌న్య శ్రీదేవి లేర‌నే వార్త ఇప్ప‌టికి ఓ క‌ల‌గానే ఉంది. ఆమె మ‌ర‌ణ వార్త విన్న ప్ర‌తి ఒక్క అభిమాని శోక‌సంద్రంలో మునిగారు. శ్రీదేవి ఇక భౌతికంగా కనిపించ‌రనే విష‌యం అభిమానుల గుండెలు పిండేసిన‌ట్టుగా ఉంది. శ్రీదేవి మృతికి సంతాపంగా ముంబైలోని లోఖండ్ వాలాలో ఉన్న‌ గ్రీన్ ఏకర్స్ కో ఆప‌రేటివ్ హౌజింగ్ సొసైటీ హోళీ వేడుక‌లని ర‌ద్ధు చేసిన‌ట్టు ఓ ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపింది. మార్చి 2న హోళి సంద‌ర్భంగా రెయిన్ డ్యాన్స్, మ్యూజిక్ సిస్టం, క‌ల‌ర్ నీళ్ళు చ‌ల్లుకోవడం వంటివి జ‌ర‌ప‌కూడద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు సొసైటీ చైర్మ‌న్ తెలియ‌జేశారు.