శ్రీదేవి బయోపిక్‌ కోసం బోనీ ఏర్పాట్లు

SRIDEVI-1
SRIDEVI-

ప్ర‌స్తుతం అంత‌టా బ‌యోపిక్‌ల సీజ‌న్ న‌డుస్తుండ‌గా, శ్రీదేవి జీవిత నేప‌థ్యంలో ఓ చిత్రం చేయాల‌ని ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో వారికంటే ముందే బోని.. శ్రీదేవి బ‌యోపిక్ చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. శ్రీదేవి గురించి పూర్తిగా తెలిసిన బోని క‌పూర్ ఆ చిత్రానికి న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని అభిమానులు కూడా భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే శ్రీదేవి జీవితంపై సినిమా తీయడానికి కాపీ రైట్స్‌ కూడా తీసుకునే ప‌నిలో బోనీ ఉన్నాడ‌ని స‌మాచారం. పుస్త‌క రూపంలోను శ్రీదేవి జీవితాన్ని ప్ర‌జ‌ల ముందుకు తీసుకురానున్నాడ‌ట బోని. మ‌రి శ్రీదేవి పాత్ర కోసం ఏ న‌టిని ఎంపిక చేసుకుంటారో చూడాలి.