శైవ ప్రాశస్త్యం

                                     శైవ ప్రాశస్త్యం

LORD KRISHNA
LORD KRISHNA

వేదోపనిషత్తులలో నిరూపింపబడిన పరమ పరుషుడు శివ్ఞడు. ఇతడే రుద్రుడనియు, ఈశానుడనియు, లింగస్వరూపుడనియు ఆయా సందర్శములలో చెప్పబడినది. (శివ ఏవ కేవలః) అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రతిపాదించుచున్నది. శివ్ఞడు మాత్రమే పరదైవమనియు అతనొక్కడే కలడనియును ఈ మంత్రమున కర్థము. సృష్టిని పూర్వము సత్తుగాని, అసత్తుగాని లేదనియును కేవలము శివ్ఞడొక్కడే కలడనియు వేదాలు తెలియజేయుచున్నవి. చారిత్రకముగా పరిశీలించి చూచినను పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనల ననుసరించి విశ్లేషించి చూచినను శైవమే అత్యంత ప్రాచీనమతమని నిర్థారించబడింది. భారతదేశములోని మొహంజొదారో, హరప్పా, లోథాల్‌ మొదలైన ప్రాంతములలోని భూగర్భ పరిశోధనలలో వెలువడే పశుపతి నాధుని విగ్రహములు, శివలింగములు శైవము ప్రాచీనతను వెల్లడించు చున్నవి. అమెరికాలోని మాయన్‌ నాగరికతలో బయల్పడినవి కూడా శివపూజయే. క్రీస్తుకు పూర్వము కొన్ని వేల సంవత్సరములకు పూర్వమే ప్రపంచ వ్యాప్తముగా శివోపాసన జరుగుచుండెడిది.

ఈజిప్టులోని నైలునదీ తీరంలో శివపూజ చేసెడివారు. ఈ నైలునదికి ప్రాచీన నామము నీలానది. అచటి దైవము పేరు ”ఇస్సీ ఇది ఈశ్వర శబ్ధ వికృతి ఈ నదీ తీరములో నాగరికతపు పేరు మెసపోటేనియల్‌ నాగరికత అచట ప్రజల ఉపాస్య దైవము శివ్ఞడే. మక్కాలోని మక్కేశ్వర లింగమును ఆ దేశస్థులు ఖర్జూరపు ఆకులతో పూజించెడివారు. ఈ కారణము చేత ఆ దైవమునకు ఖర్జురేశ్వరుడు అని కూడా పేరు. ఇట్లే కంపూచియా, ఇండోనేషియా, ఇరాన్‌, బర్మా మొదలైన సమస్త ప్రాంతములలోను, వేలాది సంవత్సరాలకు పూర్వమే శివపూజ సాగుచున్నట్లు నేటికిని అచటి శివాలయములు, త్రవ్వకములు, సాక్ష్యమిచ్చుచున్నవి. భారతదేశములో అనాదిగా శైవమే మతము. కాశ్మీరము నుండి కన్యాకుమారి వరకు, అటకము నుండి కటకము వరకు లింగపూజ సాగుచుండెడిది. అనాదిగా భారతదేశములో ఏకాత్మతతను ప్రతిపాదించుచు మొత్తము దేశమును పన్నెండు జ్యోతిర్లింగములు పరచుకొని యున్నది.

అవి 1) సోమనాధము 2) మల్లికార్జునము 3) మహకాళము 4) ఓంకా రము 5) వైద్యనాధము 6) భీమశంకర లింగము 7) రామేశ్వర లింగము 8) నాగేశలింగము 9) విశ్వేశ్వర లింగము 10) త్య్రంబకం లింగం 11) కేదార లింగము 12) ఘశ్మేశ్వర్‌ లింగము శైవంలో నాలుగు ప్రధాన శాఖలున్నాయని మద్వాచార్యుడు పేర్కొ న్నాడు. 1. నకులీష పాశుపతం. 2. శైవము 3. ప్రత్యాభిజ్ఞ 4. రసేశ్వర. ఇవికాక మరో రెండు శాఖలున్నట్లు యమునాచార్యుని ఆగమ ప్రామాణ్యం వల్ల తెలుస్తుంది. అవి కాపాలికులు, కాలాముఖులు, శైవశాఖలో వీరశైవము లేదా శక్తి విశిష్టాద్వైతము, శైవసిద్ధాంతమునే రెండు ఉపశాఖలున్నాయి. వీరశైవాన్ని లింగాయతము లేదా సత్ఫలమంటారు. శైవసిద్ధాంతములో వేదాంత ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని శుద్ధాపైత్యముంటారు. దీనిలో మూడు తత్వాలున్నాయి. 1. పతి (దైవము) 2. పశువ్ఞ (జీవాత్మ), 3. పాశము (బంధము) శైవసిద్ధాంతములో దైవాన్ని హరుడు శివ్ఞడు అనే పేర్లతో పిలుస్తారు.

ఇతడు జీవాత్మ సంబంధాలను హరిస్తాడు.విశ్వము హరునిలో లయిస్తుంది. దైవము పరమానందము కనుక శివ్ఞడని పిలవవచ్చు దైవము పరమసత్యము. శైవమత ప్రకారం శివ్ఞడు త్రిమూర్తులలో అధికుడు. ఈశ్వరుడు మహేశ్వరుడు అనే నామాలు శివ్ఞనికే చెల్లుతాయి. శివ్ఞనకు మంగళాకారులయిన అష్టగుణాలున్నాయి. అవి స్వతంత్ర ప్రత్తి, శుచి, ఆత్మజ్ఞానము సర్వజ్ఞతము, స్వతంత్రత, అపార కరుణ, ఆనందము, శివ్ఞడు మానవజ్ఞానమున కతీతుడు. శివ్ఞడు విశ్వాంతర్యామి, విశ్వాతీతుడు శివభావము మనో ఇంద్రియాలకు అతీతము, పంచభూతాలు, సూర్యచంద్రులు, పురుషుడు ఈ ఎనిమిది శివ్ఞని అష్టమూర్తులు. జీవాత్మలు తమ మాలిన్యాన్ని తొలగించుకోవడం కొరకే శివ్ఞడు ఈ విశ్వాన్ని సృష్టిచేసినాడు.

విశ్వమేర్పడటానికి మాయ కారణము. మాయ స్వయంగా విశ్వాన్ని సృష్టించలేదు. ఇది ఉపాదాన కారణమవ్ఞతుంది. దైవము నిమిత్త కారణంగా ఈ విశ్వమేర్పడుతుంది. శివ్ఞడు విశ్వసృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహ కారకుడు, వీటిని శివ్ఞని పంచకృతులంటారు. శైవసిద్ధాంతంలో అవతార భావనలేదు. శివ్ఞడు కర్మరహితుడు కనుక అతనికి శరీరము లేదు. భక్తులను రక్షించడానికి, దర్శనమివ్వటానికి, ఆకృతిని పొందుతాడు. శివాకృతులు మూడు విధాలు, భోగరూపము, ఘోరరూపము, యోగరూపము ఈ రూపాలన్నీ అనుగ్రహ రూపాలు. ఆయన ముఖ్య రూపము గురు రూపము. ఈ రూపంలో జీవ్ఞడిని సంసార బంధాల నుండి విముక్తిని శాసిస్తాడు. 

– కె. రవీందర్‌ గౌడ్‌