శృతి.. రాగాలు పలికించే హృదయాలు

shruti haasan
shruti haasan

నాలుగేళ్ల క్రితం గబ్బర్‌సింగ్‌ దెబ్బకు ఒక్క సినిమాతోనే స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది శృతిహాసన్‌. ఆ తర్వాత కాటమరాయుడు చేసింది. దాని తర్వాత మాత్రం ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. తాజాగా ఒక మీడియా ఇంటర్య్వూలో అసలు తాను ఎందుకు సినిమాలు చేయటం లేదో చెప్పే ప్రయత్నం చేసింది. గతంలో తాను ఒప్పుకుని చేసిన కొన్ని సినిమాలు ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉన్నపుడే ఇవి ఎందుకు ఒప్పుకున్నానా అని ఫీలయ్యానని తర్వాత చేయకపోయి ఉంటే బాగుండేది అని అన్పించిందని అందుకే తొందరపడి ఏ సినిమాలు సైన్‌ చేయటం లేదని చెప్పింది. చేతిలో సినిమాలు లేకపోయినా. శృతిహాసన్‌ నటించిన ఒక్క సినిమా మాత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అదే శభాష్‌రాయుడు. నాన్న కమల్‌హాసన్‌తో ఆయన కూతురుగా రియల్‌లైఫ్‌ పాత్ర పోషించింది.