శృతి ఫిలాసఫీ

SHRUTI HASSAN-1
SHRUTI HASSAN

శృతి ఫిలాసఫీ

చాలా వరకు సక్సెస్‌రేట్‌ ఉంటేనే దర్శక నిర్మాతలు హీరోయిన్సును సెలక్ట్‌చేసుకుంటారు.. కానీ కొంతమంది వారి అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే రెమ్యూనరేషన్‌ తగ్గించి సినిమా కథకు తగ్గట్టు ప్లాప్‌హీరోయిన్లును సెలక్ట్‌చేసుకుంటారు. అదే తరహాలో గతంలో శృతిహాసన్‌ చాలా సినిమాలు చేసింది.. బాలీవుడ్‌లో అంతగా అవకాశాలు రాకపోవటంతో సౌత్‌లో అడుగుపెట్టింది.. పవన్‌కల్యాణ్‌ గబ్బర్‌సింగ్‌ శృతి తలరాతను మార్చేసింది.. అయితే అమ్మడు ఇపుడు తెలుగు సినిమాలను ఓకే చేయటం లేదు.. ఒక సోషల్‌ మీడియాలో రోజూ ఏదో ఒక ఫిలాసఫీతో అందర్నీ ఆకట్టుకునేప్రయత్నం చేస్తోంది.. మీరు ఉదయాన్నే ఏది ఫీల్‌ అవుతారో అది చేయటం సాధ్యమే.. ప్రణాళికలతో వెళితే ప్రతి పనిలో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నేను ప్రతి కళను నేర్చుకుంటూ ప్రతి ఏటా ఎంతో సరదాగా గడుపుతున్నాను అంటూ శృతి ట్వీట్‌ చేసింది.