శుభ్రంగా పాత్రలు

Steelf
Strainless Steel washing

శుభ్రంగా పాత్రలు

స్టీలు పాత్రల పరిశుభ్రత చాలామంది తమ ఇళ్లల్లో స్టీలుపాత్రల్లో వంట చేస్తుంటారు. భోజనం వాటిలోనే చేస్తుంటారు. దీనికి కారణం స్టీలు సామాన్లు ఎక్కువకాలం పాటు మన్నికగా ఉండడమే. శుభ్రం చేయడం ఎంతో సులభం. తుప్పు పట్టకుండా ఉంటాయి. అయినా ఇవి కూడా సమయంతో పాటు క్రమంగా మెరుపు కోల్పోయి పాతబడుతుంటాయి. చాలా సందర్భాల్లో మచ్చలు పడడం, కాలిపోవడం కారణంగా ఇవి మెరుపు కోల్పోతుంటాయి. ఒకవేళ మీ స్టీలు పాత్రల్లో ఏదైనా మాడి దానికి అంటుకుపోయి ఉంటే దానిని మోటార్‌ స్క్రబ్బర్‌(ఇనుపపీచుతో) రుద్ది దానిని వదిలించాలని ప్రయత్నం చేయకండి. ఇలా చేస్తే దానికి ఉన్న స్టీలు పాలిష్‌ వదిలిపోవడమే కాదు దాని మీద బాగా గీతలు పడిపోతాయి.
మాడిన దానిని పోగొట్టడానికి పావ్ఞ గ్యాలను నీళ్లల్లో మూడు పెద్ద చెమ్చాల వాషింగ్‌ పౌడర్‌ను వేసి బేకింగ్‌సోడాను కూడా అందులో కలిపి మాడిన పాత్రను అందులో ముంచి కొద్దిసేపు నానబెట్టాలి. ఆ తర్వాత అది సులభంగా శుభ్రమవ్ఞతుంది. బేకింగ్‌సోడా (వంటసోడా)కు బదులు పాత్రలను శుభ్రం చేసేటప్పుడు డిటర్జెంటులో కానీ, నీళ్లలో కానీ ఒక చెంచా నిమ్మరసాన్ని కలపాలి. పాత్రలు మరింత మెరుస్తాయి.
టమాట, చింతపండును కూడా క్లీనింగ్‌ ఏజంట్లుగా వాడవచ్చు. అలాగే తెల్లని వెనిగర్‌ జెల్‌ కూడా పాత్రలకు ఉన్న మరకలను తొలగిస్తుంది. వెనిగర్‌లో బట్టను ముంచి కట్లరీ లేదా పాత్రలను శుభ్రం చేయవచ్చు.
ఆలివ్‌ ఆయిల్‌, క్రీం ఆఫ్‌ టార్టర్‌, కార్న్‌స్టార్స్‌ పేస్టులు కూడా స్టీలు పాత్రలకు కొత్త మెరుపును ఇస్తాయి. గాజు పాత్రల పరిశుభ్రత ఒకేసారి ఎక్కువ గాజు పాత్రలను శుభ్రం చేయాల్సి వస్తే వాటిని ఏదైనా ప్లాస్టిక్‌ టబ్‌లో వేసి శుభ్రం చేయండి. లేదా ఏదైనా పాత టవల్‌ను సింక్‌లో పరిచి శుభ్రం చెయ్యండి. రెండు భాగాలుగా విభజించి ఉన్న సింక్‌ ఉంటే వాటి డివైడర్‌ (మధ్యప్రాంతం) మీద పెట్టి పాత్రలను తోమండి. బాగా నురుగు తప్పించే ప్రయత్నంలో ఎక్కువ డిటర్జెంటును వాడకండి. వేడినీటితో శుభ్రం చేస్తే ఇవి ఎంతోబాగుంటాయి.
ఒకవేళ ఏదైనా పదార్థం అంటుకుని, ఎండిపోయి ఉంటే దాన్ని స్టీలు, ఊల్‌, ప్లాస్టిక్‌ స్క్రబ్బర్లతో రుద్ది లేదా చాకుతో గీకి అది వదలించడానికి ప్రయత్నించకండి. దానిని బేకింగ్‌సోడా మిశ్రమంలో ముంచి శుభ్రం చెయ్యండి. కప్పులో ఉన్న టీ లేదా కాఫీ మరకలను తొలగించడానికి పావ్ఞ గ్యాలన్‌ నీటిలో రెండు పెద్ద చెంచాల క్లోరిన్‌ బ్లీచ్‌ కలిపి అందులో పాత్రలను ఒకటిన్నర నిమిషాల పాటు ముంచి ఉంచండి. ఆ తర్వాత తీసి శుభ్రం చేయండి. గాజు లేదా పింగాణీ పాత్రలను డిష్‌ వాషర్‌లో వేసే ముందు వాటిని డిష్‌ వాషర్‌లో వేయవచ్చో లేదో నిర్థారణ చేసుకోండి. మీ డిష్‌ వాషర్‌ మెయింటెనెన్స్‌ విషయంలో తగినంత శ్రద్ధ చూపాలి. ఎప్పటిక ప్పుడు దానికి పట్టిన మరకలను, మురికిని, తుప్పును తొలగిస్తూ ఉండాలి. డిష్‌వాషర్‌లో ఎప్పుడూ మంచి క్వాలిటీ సబ్బు, లిక్విడ్‌సోప్‌ ఉపయోగించాలి.