శీతాకాల పానీయాలు

                    శీతాకాల పానీయాలు

ginger tea
ginger tea

వాతావరణంలో మార్పులు వస్తుంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని, పానీయాలను తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో శరీరంలోని మంచి, చెడు బ్యాక్టీరియాల బ్యాలెన్స్‌లో మార్పులు వస్తాయి. ఈ మార్పు రోగనిరోధకశక్తిపై ప్రభావం చూపుతుంది. బ్యాలెన్స్‌ను సాధించాలంటే ప్రోబయాటిక్స్‌ అవసరమవుతాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ అలెర్టిక్‌ గుణాలుంటాయి. యోగర్ట్‌లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ముక్కు దిబ్బడను పొగొట్టేందుకు అల్లం, వెల్లుల్లి, మిరియాల వంటివి బాగా పనిచేస్తాయి. వీటిలోని కాప్సైసిన్‌ కాంపౌండ్‌ సైనస్‌ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. చలికాలంలో చర్మ సంబంధ అలెర్జీలు కూడా పెరుగుతాయి. ఈ లక్షణాలను ఎదుర్కోవాలంటే శరీరానికి విటమిన్‌ సి తప్పనిసరి.

కమలాఫలాలు, స్ట్రాబెర్రీ, క్యాబేజీల్లో విటమిన్‌ సి అధికంగా లభిస్తుంది. ఈ సీజన్‌ ఊపిరితిత్తులు బాగుండాలంటే మెగ్నీషియం తప్పనిసరి. పాలకూర, జీడిపప్పు, చిక్కుళ్లలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే పానీయాలివే.. కొబ్బరి నీళ్లు, పసుపు, అల్లం మిశ్రమాన్ని వడగట్టి వాల్‌నట్స్‌, జీడిపప్పు వేసుకుని తాగాలి. ఈ జ్యూస్‌ తాగితే ఆర్థరైటిస్‌, ఆస్తమా, ఎగ్జిమా నుంచి తప్పించుకోవచ్చు. అంతేగాక పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు క్యాన్సర్‌ కణాలు పెరగకుండా చేస్తాయి. కీరదోస, పైనాపిల్‌, ఆపిల్‌ ముక్కలు, నిమ్మరసం కలిపిన మిశ్రమంలో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. అల్లం, పసుపు, యాలకులు, తులసి ఆకులు వేడినీళ్లలో మరిగించి, ఈ మిశ్రమంలో తేనె కలిపి తాగితే దగ్గు, జలుబు, గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

green tea
green tea