శిశువు, తల్లికి జియోటాజింగ్ విధానం: పూనం
శిశువు, తల్లికి జియోటాజింగ్ విధానం: పూనం
విజయవాడ: శిశువు, తల్లికి జియోట్యాగింగ్ విధానం ప్రవేశపెడతామని వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. వైద్యశాలల్లో శిశువుల అపహరణ, ఇంత లోపాల నివారణపై దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. శిశువును ఎవరు తీసుకెళ్లినా పోలీసుల, రెవెన్యూ అధికారులకు సమాచారం తెలిసేలా ఆర్ఎస్ఐడి ట్యాగింగ్ విధానం అమలులోకి తెస్తామన్నారు. నేటి నుంచి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో 10 రోజులపాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని పరిస్థితిని పరిశీలించిన తర్వాత అన్ని వైద్యశాలల్లో ఈ విధానం అవలంభిస్తామని ఆమె వెల్లడించారు.