శిరోజాల మెరుగుకు మెంతులే!

శిరోజాల మెరుగుకు మెంతులే!
శిరోజాల ఎదుగుదలకు మెంతులలో ఉండే ఒక ప్రొటీన్ సహాయపడుతుంది. తలలో వ్ఞండే పేలను, చుండ్రును మెంతులు నియంత్రిస్తాయి. మెంతులను రాత్రిపూట నానబెట్టి మరుసటిరోజు ఉదయం బాగా మెత్తగా రుబ్బి ఆ ముద్ద మాడుకు పట్టించుకుని, అరగంట తరువాత బాగా శుభ్రంగా కడుక్కోవాలి.
ముద్దకు ఆలివ్ ఆయిల్ కలిపితే మరీ మంచిది. మెంతులు, గోరింటాకు కలిపి ప్రతివారం తలకు రాసుకుంటే శిరోజాలు బాగుంటాయి. గోరింటాకు రుబ్బుకునేటప్పుడు మెంతులను కూడా వేసి రుబ్బాలి. ల దానికి నాలుగు చెంచాల నిమ్మరసం, రెండు పచ్చిగుడ్లు, ఒక స్పూన్ మెంతిపొడి, తగినంత టీ డికాషన్ కలిపి బాగా ముద్దగా చేసి తలకు పెట్టుకోవాలి. దానిని ఆరనిచ్చి తలను కడిగేసుకంటే బాగుంటుంది. ఎండు ఉసిరి ఒక కప్పు, రెండుకప్పుల పెరుగు తీసుకుని ఒక ఇనుపగిన్నెలో రాత్రంతా నానబెట్టాలి.
మరుసటిరోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది. ల సరిపడా హెన్నా, గుడ్డుసొన, అరచెక్క నిమ్మరసం, ఒక టేబుల్‌స్పూన్ ఇన్స్టంట్ కాఫీపొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 45నిమిషాల తరువాత కడిగేస్తే జుట్టు మృదువ్ఞగా ఉంటుంది.