శిరిడీ వస్తూ అనంతలోకాలకు చేరిన వృద్ధురాలు

B N

హైదరాబాద్‌: తన మనవళ్లతో తీర్థయాత్ర చేసి తిరిగోచ్చే క్రమంలో ఒక వృద్ధురాలు రైలు ప్రయాణంలోనే అనంతలోకాలకు చేరిన సంఘటన ఆదివారం రైల్వే స్టేషన్‌లో సంభవించింది. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కనకసీత(71) హైదరాబాద్‌ నగరంలో ఉన్న ఆమె మనవడు, మనవరాళ్లతో కలిసి ఇటీవల శిరిడీ యాత్రకు వెళ్లారు. తిరిగి శనివారం నాగర్‌సోల్‌లో రైలు ఎక్కి ఆదివారం ఉదయం సికింద్రబాద్‌ స్టేషన్‌లో మరో కొద్దీ సమయంలో దిగుతారనగా కనకసీతకు హఠాత్తుగా గుండె నోప్పి బెర్తుపై ఒరిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా బాధితురాలిని పరీక్షించిన వైద్యులు అప్పటటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఇన్‌స్పెక్టర్‌ చంద్రయ్య ఆధ్వర్యంలో హెచ్‌సి మురళి కేసు దర్యాప్తు చేస్తున్నారు.