శిక్షలు పటిష్టంగా అమలు చేయాలి

     శిక్షలు పటిష్టంగా అమలు చేయాలి

eve teasing
eve teasing

ఆడపిల్లలు ఇంటా, బయటా అడ్డంకులు అధిగమిస్తూ విజయాలను అందుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఆవకాయ పెట్టడం నుండి అంతరిక్ష ప్రయాణం వరకూ, పాడిపంటలు నుండి పరిపాలన వరకు అవకాశం దోరికితే తాము సాధించలేనిది ఏమీ లేదని నిరూపిస్తూనే వున్నారు. స్త్రీలు ఇంటిని వృత్తిని పురుషుల కన్నా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పురుషులతో సమానంగా ఓటు హక్కు కలిగి ఉన్న మహిళలు, గ్రామస్థాయి నుంచి అత్యున్నత పార్లమెంటు ఎన్నికల వరకు పురుషులలో సమానంగా పాల్గొంటున్న వీరికి ఇంకా పూర్తిగా సాధికారత సమకూరలేదు.

మనదేశం ఒక ప్రజాస్వామ్మ దేశం. మన రాజ్యాంగం ద్వారా ప్రజలందరికి సమానత్వం, స్యేచ్ఛ, న్యాయం,కులమత లింగబేధాలు లేకుండా సంక్రమిస్తాయి. రాజకీయ సాధికారత కల్పించి తద్వారా స్త్రీలకు సామాజికంగా, ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం ఒక ముఖ్య అంశంగా పరిణమించింది. ప్రస్తుత పరిస్థితులో మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు అమలుచేయడం అవసరం. ఇది స్త్రీలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు, దేశ పరిపాలనలో ఎటువంటి ర ప్రయోజనం పోందని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లభిస్తుంది.

లింగవిబేధాలు దేశ సమాజంపై ప్రభావం కలిగి ఉన్నాయి. రాజకీయ కార్యకలాపాలలో స్త్రీలను మరింత మమేకం చేయాలంటే కార్యక్రమాలు చేపట్టవలసి ఉంది. సనాతన భారతీయ సమాజంలో పురుషునిపై స్త్రీ ఆధారపడడం అత్యంత సాధారణమైన విషయం. ఆర్యుల కాలంలో స్త్రీ గౌరవమర్యాదల విషయాలకు స్వర్ణయుగం అని చెప్పవచ్చు. మధ్యయుగకాలంలో స్త్రీల పరిస్థితి దిగజారింది. ర అనంతరం బ్రిటీష్‌ పాలనా కాలంలో స్త్రీ రక్షణ చట్టాలు అమలుపరచడం ప్రారంభమైనది. స్వాతంత్య్రానంతరం భారతరాజ్యంగ నిర్మాతలు మహిళలకు సమాన హక్కులు కల్పించారు.

పురుషులతో సమానమైన హోదా ఉద్యోగనియామకంలో వివక్షత నిషేదించడం వంటి రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మన దేశంలో మహిళల హోదా పెరిగింది. సతీసహగమన నిషేధ చట్టం, వితంతుపునర్వివాహ చట్టం, బాల్యవివాహాల నిరోధక చట్టం, స్వాతంత్య్రానికి ముందు తీసుకొచ్చిన చట్టాలు, హిందువారసత్వ చట్టం, వరకట్న నిషేధచట్టం, ప్రసూతిసౌకర్య చట్టం, స్త్రీ పురుష సమానవేతన చట్టం, వెట్టిచాకిరి నివారణచట్టం, ఆశ్లీలప్రదర్శన నిరోధచట్టం, బాలకార్మికుల నిరోధచట్టం,షేడ్యులు కులాలు తెగల చట్టం జాతీయమహిళ కమిషన్‌,

మానవశరీర లింగ మార్పిడి నిషేద చట్టం, లింగనిర్థారణ పరీక్షల నివారణచట్టం, గృహహింస నిరోధచట్టం మహిళల కోరకు స్వాతంత్య్ర అనంతరం తీసుకొచ్చిన చట్టాలు, మహిళల రక్షణ కొరకు ఇన్ని చట్టాలను అమలు పరుస్తున్నా విధాన లోపాలు, సామాజిక విలువ పతనం వలన ఇటీవల మన దేశంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. ర నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పొటీ పడుతున్నారు.

కానీ భారతీయ స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం ప్రథమార్ధంలో భారతీయ మహిళలు ఇంటికే పరిమితమై అక్షరాస్యతలో వెనుకబడి వురుషులతో సమానంగా స్వేచ్ఛ అవకాశాలను పోందలేకుండా ఉన్న సమయంలో కొంతమంది భారతీయ వనితలు ధైర్యసాహసాలతో ముందుకు వచ్చి నేటికి ముందు తరాలవారికి ఆదర్శ ప్రాయంగా నిలిచి నేడు మన దేశంలో మహిళలు అన్ని రంగాలలో పోటీ పడటానికి కారకులయ్యరు.

సరోజినినాయుడు, విజయలక్ష్మీ పండిట్‌, అనిబిసెంట్‌, మధర్‌థెరిస్సా, ఇందిరాగాంధీ, రాజకుమారి అమృత కౌర్‌,కల్ననాచావ్లా, ప్రతిభాదేవీసింగ్‌ పాటిల్‌, మీరాకుమారి వంటి వారు ఉన్నారు. ర మనరాజ్యాంగంలో మహిళ రక్షణ నిబంధనల ప్రకారం ఆర్టికల్‌ 14 నిబంధన ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. 15(1) ప్రకారం స్త్రీ పురుష వివక్షత చూపరాదు. 15(3)ప్రకారం స్త్రీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చును.

16(2) ప్రభుత్వ ఉద్యోగాలలో లింగవివక్షత చూపించకూడదు. 19-స్త్రీ,పరుషులకు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులున్నివి. 23-మనుషులతో బలవంతపు వ్యాపారం వెట్టిచాకిరి నిషేదించాలి, 39 (ఏ) ప్రకారం స్త్రీ పురుషులందరికి సమానమైన జీవన బృతి హక్కులు కల్పించేటట్లు ప్రభుత్వ విధానాలు ఉండాలి. 39 (బి) ప్రకారం స్త్రీ పురుషులకు సమానమైన పనికి సమానమైన వేతనాలు ఇవ్వాలి. 42 ప్రకారం స్త్రీలకు ప్రసూతి సౌకర్యం కల్పించాలి. 51(ఎ,సి) ప్రకారం స్త్రీల గౌరవానికి భంగం లేకుండా చర్యలు తీసుకోవాలి.

లైంగిక నేరాల నిరోధక ఆర్డినెన్స్‌ 2013 క్రిమినల్‌లా అమెండ్‌మెంట్‌ బిల్‌ మహిళలకు రక్షణగా, కామాందుల పాలిట యమపాశంగా ఉన్నది. శిక్షాస్మృతి సెక్షన్‌లు 326(ఎ) 326(భి) ,354(బి),354(డి) 370, 375, 376(ఎ),376(సి) 376(డి) 376(ఇ) స్త్రీల రక్షణకు రూపోందించిన చట్టాలు ఉన్నాయి. ర ప్రభుత్వాలు అమలుపరుస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలవల్ల స్త్రీల అభివృద్ధికి ప్రత్యేక రక్షణ సౌకర్యాల వలన నేడు స్త్రీలు సమాజంలో అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారు.

మాహిళలపై జరిగే హింసలు నిరోధించడానికి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికి విచారణ పద్దతులలో లోపాలు ఉండటం వల్లనే నిందితులు తప్పించుకుంటున్నారు. అన్ని రంగాలలో మహిళల స్థాయిని పెంచడం ద్వారా మరియు మానవతా విలువలు సామజిక చైతన్యం ద్వారానే సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం కాగలదు. సెక్షన్‌ 228 ప్రకారం మానభంగానికి గురైన స్త్రీ అనుమతి లేకుండా ఆమె పేరును గాని, గుర్తింపును గాని ప్రకటించకూడదు.

భారతీయ శిక్షాస్మృతి 372,373 సెక్షన్‌ల ప్రకారం వ్యభిచారం కోసం బాలికల కొనుగోలు, అమ్మకం నిషేదిస్తుంది. అంతేకాక మానభంగానికి పాల్పడితే ఐపిసి సెక్షన్‌ 376 లైంగిక వేధింపులకు గురిచేస్తే ఐపిసి సెక్షన్‌ 354 ఎత్తుకు పోవడానికి పాల్పడితే 363,373 సెక్షన్‌లు, వరకట్న వేధింపులకు గురి చేస్తే 498 (ఎ) వరకట్న చావులకు ఆత్మహత్యలకు కారణమైతే 304 (బి) కిందకేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటారు. ర తమ గృహంలో పనులు నిర్వహించడంతో పాటు సమాజాభివృద్ధి అమలు చేయు ప్రాజెక్టు లలోనూ కార్యక్రమాలోలనూ, సమావేశాలలోనూ పాల్గోంటున్నారు.

మహిళలు కేవలం మహిళల సమస్యలనే గాక, పురుషుల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారు. పని చేసే చోట మహిళలకు రక్షణ నిమిత్తం 2006 లోనే ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించింది. మహిళ నిరంతర యోదురాలు, గెలుపు రుచి తెలిసిన కార్యసాధకురాలు. నిత్య చైతన్య శీలి, సత్యశోధకురాలు, అమ్మగా జోల పాడుతునే, నేతగా అవినీతిపరులను నిద్రపోనివ్వదు. అవసరమైతే తన దారి తానూ ఏర్పరచుకోని పెడదారిని ప్రశ్నిస్తుంది. ఇంత చైతన్యం వున్నా! కొంత సంధిస్తే ఆమెపై ఆత్యాచారాలు, అఘాయిత్యాలు, ఘోరాలు, నేరాలు పెరిగిపోతూనే వున్నాయి.

మహిళల రక్షణ కొరకు ఎన్నో చట్టాలను అమలు పరుస్తున్నా విధాన లోపాలు, సమాజిక విలువల పతనం వలన ఇటీవల కాలంలో మన దేశంలో మహిళలపై దాడులు విశృంఖల చర్యగా పెరిగాయి. నేరాల సమస్యను పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం ఇదే మొదటిసారి. శిక్షల గురించి ప్రచార లోపాలు,మాదక ద్రవ్వాలు వీటిపై ప్రభుత్వం చోరవచూపి శిక్షలు పటిష్టంగా అమలు పర్చేలా చర్యలు తీసుకుని స్త్రీలను రక్షించడానికి కావల్సిన చర్యలు చేపట్టాలి.
– ఆర్‌విఎం సత్యం