శారీరక సంబంధం ఉన్నా వివాహం చేసుకోకపోతే అత్యాచారం కాదు

couple
couple

Mumbai: స్త్రీ పురుషుల మధ్య శారీరక సంబంధం ఉన్నప్పటికీ, వివాహం చేసుకోనిపక్షంలో అది అత్యాచారం కిందకు రాదని సెషన్స్‌ కోర్టు ఒకటి తీర్పు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి 30 ఏళ్ల వయస్సున్న ఒక నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది. తనను వివాహం చేసుకుంటానని చెప్పి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఒక మహిళ మనోజ్‌ మోరె అనే వ్యక్తిపై 2013లో కేసు పెట్టింది. కాగా అప్పట్లో వారిద్దరూ సహజీవనం కొనసాగించారు. ఆమె ఒక బిడ్డకు జన్మినిచ్చింది. అనంతరం ఆమె అతడిపై కేసు పెట్టింది. ఈ కేసు విచారించిన
సెషన్స్‌ కోర్టు ఇరువురూ ఐచ్ఛికంగా కలిసి జీవించారని, వారి మధ్య శారీరక సంబంధం అత్యాచారం కిందకు రాదని పేర్కొంది.