శాన్‌ఫ్రాన్సిస్కో చేరిన మహిళల విమానం

flaitశాన్‌ఫ్రాన్సిస్కో చేరిన మహిళల విమానం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడి నుంచి బయలు దేరిన ప్రత్యేక విమానం సోమవారం సాయంత్రానికి శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకుంది. పైల్‌నుంచి, సిబ్బంది ప్రయాణికులు అందరూమహిళలే కావటం విశేషం. ఎయిర్‌ ఇండియాకుచెందిన విమానం ఢిల్లీ నుంచి బయలుదేరి సుమారు 17 గంటలపాటు ఏకబిగిన ప్రయాణించి శాన్‌ఫ్రాన్సిస్కో చేరిందని ఎయిరిండియా సిఎండి అశ్వని లోహాని తెలిపారు. క్షమతా బాజ్‌పా§్‌ు,సుభాంగిసింగ్‌ల ఆద్వర్యంలో నడిచిన ఈ విమానంలో ఫస్ట్‌ ఆఫీసర్లుగా రమ్యకీర్తి గుప్తా, అమృత్‌నాంధీరి వ్యవహరించారు.