శాటిలైట్ రైల్వేస్టేషన్‌కు పీయుశ్ గోయల్ శంకుస్థాపన

427 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై ప్రారంభించిన గోయల్‌

Piyush-Goyal
Piyush-Goyal

హైదరాబాద్‌: కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చర్లపల్లిలో శాటిలైట్‌ రైల్వే స్టేషన్‌ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎస్‌సీఆర్ పరిధిలో 427 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సేవలను ఈ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.  యూపీఏ హాయాంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ.258 కోట్లే కేటాయించారని, ఎన్డీఏ హాయాంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,602 కోట్లు కేటాయించినట్లు మంత్రి పీయుశ్ గోయల్ వెల్లడించారు. అంతకుముందు నిధుల గురించి మంత్రి తలసాని కేంద్రాన్ని ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని పీయుశ్ గోయల్ కౌంటర్ ఇచ్చారు. దక్షిణ భారతాన్ని విస్మరిస్తున్నారని తలసాని అనడం ఎంత మాత్రం సరికాదని అన్నారు. ఖఖరాష్ట్రాలు సహకరిస్తేనే లైన్లు వేగంగాపూర్తవుతాయి. రైల్వే కేటాయింపులు రాష్ట్రాల పరిధిలో ఉండవు. రైల్వే జోన్ల పరిధిలో ఉంటాయి.గగ అని కేంద్ర మంత్రి పీయుశ్ గోయల్ అన్నారు.

హైదరాబాద్‌ నగరంలో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్య వల్లే చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో శాటిలైట్ టెర్మినల్ నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దీని నిర్మాణానికి ఉన్న ప్రాధాన్యాన్ని రైల్వే మంత్రి పీయుశ్ గోయల్‌కు వివరించగా ఈ ప్రాజెక్టును ఆయన మంజూరు చేసినట్లు వెల్లడించారు. నగరంలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగిపోతుండడం, నగర రోడ్లపై ట్రాఫిక్ రద్దీతో ప్రయాణికులు ఆయా స్టేషన్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుండడం వల్లే చర్లపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. శాటిలైట్ టెర్మినల్‌ నిర్మాణం పూర్తయితే ప్రయాణికులు నగరం మధ్యలోని ప్రధాన స్టేషన్లకు వెళ్లకుండా ఉపయోగపడుతుందని వివరించారు. ఇది రెండో దశ ఎంఎంటీఎస్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. యాదగిరి గుట్ట వరకూ ఎంఎంటీఎస్ పూర్తయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/