శాకాపోషకాలు

vegitables
vegitables

శాకాపోషకాలు

పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికంగా కనిపించే సమస్య ఆస్టియోపోరోసిస్‌. ఆడవారిలో ముఫ్పయి ఏళ్లు దాటిన తర్వాత ఎముకలు వాటి సాంద్రతని కోల్పోతాయి. కావ్ఞన మహిళలు ఈ సమస్యను తగిన ఆహారపదార్థాలతో నయం చేసుకొనుట మేలైన ఉపాయం. మీ ఎముకలు బలానికి కొన్ని చిట్కాలివిగో… ్య ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు ఓట్‌మీల్‌, క్యాబేజీ, బీన్స్‌, తృణధాన్యాలు పాల ఉత్పత్తులు తీసుకోవటం వల్ల కాల్షియం ఎక్కువగా పొందవచ్చు. కాల్షియంతో ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ్య కాల్షియం విటమిన్‌ డి ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు తగినంత వ్యాయామం కూడా చేస్తే ఈ ఆస్టియోపోరోసిస్‌ సమస్యను నివారించవచ్చు.

ప్రతిరోజూ ఆహారంలో 400 నుంచి 1200మి.గ్రా కాల్షియం తప్పనిసరిగా తీసుకోవాలి. ్య మేగ్నీషియం కూడా ప్రతిరోజు ఆహారంలో 500నుంచి 800మి.గ్రా పరిమాణంలో తీసుకోవాలి. ్య ఆకు కూరలు, బ్రకోలీ, కీరదోస, తీయ గుమ్మడి, పొద్దుతిరుగుడు విత్తనాలు, నువ్ఞ్వలు, అవిసెగింజల నుంచి మేగ్నీషియం అధికంగా పొందవచ్చు. ్య రోజూ రాత్రిపూట గ్లాసు పాలు తప్పనిసరిగా తాగాలి. ్య నానబెట్టిన, మొలకెత్తిన శనగ విత్తనాలను తింటే ఎముకలకు ఎంతో బలం చేకూరుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ తీసుకునే పోషక ఆహారం పరిమాణం పెంచితే ఎముకల అరుగుదలలో సమస్య ఉండదు.