శాంసంగ్ సంస్థ తీపికబురు

శాంసంగ్ అందించింది. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను గ్రీన్, బ్లూ, సిల్వర్, బ్లాక్ నాలుగు రంగుల్లో రూపొందించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఎంపిక చేసిన దేశాల్లో ఏప్రిల్ 26, 2019 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని సంస్థ వెల్లడించింది. 4జీ ఎల్టీఈ, 5జీ వేరియంట్లలో శాంసంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 1,41,300గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.