శాంసంగ్‌ మరో కొత్త ఫోన్‌

SAMSUNG

SAMSUNG

ప్రముఖ మొబైల్‌ ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ మరోకొత్త మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. శాంసంగ్‌ డబ్ల్యూ 2018పేరుతో ప్లిప్‌ఫోన్‌ (మడత పెట్టుకోగలిగే)ను విడుదల చేయనుంది. గతంలోనూ ప్లిప్‌ మోడల్‌ ఫోన్లకు విడుదల చేసినా, త్వరలో మార్కెట్లోకి రాబోయే ఈ కొత్త మోడల్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉండనున్నా యి. అంతేకాకుండా దానికి తగ్గట్టుగానే దాని ధర కూడా ఆరేంజ్‌లోనే ఉంటుందని తెలుస్తోంది. భారత్‌లో దీని ధర సుమారు రూ.లక్షా యాభై వేలు పైనే ఉంటుందని సమాచారం. అయితే ఈ ఫోన్‌ను తొలుత చైనా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. డబ్ల్యూ 2018లో రెండు డిస్‌ప్లేలు ఉంటాయి. ఒకటిపైన కనిపిస్తే, మరొకటి లోపల ఉంటుంది. శాంసంగ్‌ నుంచి గత కొన్నాళ్లుగా గెలాక్సీ సిరీస్‌లోనే ఫోన్లు వస్తున్నాయి. ఇటీవల కాలంలో తొలి గెలాక్సీయేతర మోడల్‌ ఇదే. ఇందులో శాంసంగ్‌ బిక్స్‌బై వాయిస్‌ అసిస్టెంట్‌ కూడా ఉంది. ఈ సౌకర్యం ఉన్న తొలి గెలాక్సీయేతర ఫోన్‌ కూడా ఇదే. ఈ ఫోన్‌లో ఫోటోలు తీసేటప్పుడు పరిసరాల వెలుతురు బట్టి ఎఫ్‌/1.5నుంచి ఎఫ్‌/2.4కు లెన్స్‌ ఆటోమేటిక్‌గా మారుతుంది. 6జిబి ర్యామ్‌, 64జిబి/256జిబి స్టోరేజ్‌, యూఎస్‌బి టైప్‌-సిపోర్ట్‌, కామ్‌షెల్‌ ఫింగర్‌ ఫ్రింట్‌ స్కానర్‌, 2300 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, ఆండ్రాయిడ్‌ 7.1 నూగట్‌, 835స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, 12 ఎంపీ వెనుక కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉన్నాయి.