శాంసంగ్‌ మడిచే ఫోన్‌

SAMSUNG
SAMSUNG

సియోల్‌: స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్‌ కంపెనీ శాంసంగ్‌ మరో కొత్తరకం ఫోన్‌ను పరిచయం చేయబోతోంది. అదే మడతపెట్టే ఫోన్‌. ఈ ఫోన్‌ ఈ సంవత్సరం చివరి వరకు మార్కెట్‌లోకి తీసుకురాబోతోందని తెలుస్తోంది. అయితే దీని గురించి శాంసంగ్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఇది అతిపెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంటుందని, భారీ ఎత్తున 7అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుందని, వాలెట్‌లాగానే దీన్ని కూడా మడతపెట్టుకోవచ్చని ఒక రిపోర్టు ద్వారా తెలిసింది. భారీ స్క్రీన్‌తో పాటు ఈ ఫోన్‌కు ముందువైపు రెండో డిస్‌ప్లే కూడా ఉంటుందట. యూజర్లకు నోటిఫికేషన్ల గురించి తెలియచేయడం కొరకు ఈ రెండో డిస్‌ప్లే ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం. అన్ని నోటిఫికేషన్లను రెండో డిస్‌ప్లే నుంచే చెక్‌ చేసుకోవచ్చు. ఫోన్‌కు టాప్‌లో ముందువైపు ఈ రెండో డిస్‌ప్లేను కంపెనీ అందిస్తుంది. విన్నర్‌ అనే కోడ్‌నేమ్‌తో ఈ శాంసంగ్‌ మడతపెట్టే ఫోన్‌ వస్తుంది. గేమింగ్‌ ఔత్సాహికులను, వినియోగదారులను టార్గెట్‌ చేసుకుని ఈ ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. అయితే భారత స్టోర్లలోకి ఇది వస్తుందా?లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు.