శశికళను కలిసిన విజయశాంతి

బెంగళూరు : సీనియర్ నటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ఈ వారం ప్రారంభంలో శశికళను కలిసినట్లు బెంగళూరు కారాగార అధికారులు శుక్రవారం తెలిపారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఆమె శశికళను కలుసుకున్నారు. డీఎంకే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే నుంచి విడిపోయి ‘అమ్మ మక్కళ్ మున్నేట్ర కళగం పార్టీ’ని శశికళ నెలకొల్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు కోరేందుకు విజయశాంతి వచ్చినట్లు సమాచారం. . తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ విషయమై విజయశాంతి వద్ద శశికళ ఆరా తీశారని సమాచారం.