శవాసనం

ASANAMA1
ASANAMA1

శవాసనం

ఈ ఆసనం వేయడం వలన శరీర అవయవాలలోని అలసట తీరుతుంది. అందు వలన యోగాసనాలు వేసిన తరువాత శరీరానికి కొంత విశ్రాంతి నివ్వడం ఎంతో మంచిది. కావ్ఞన విశ్రాంతి కోసం వేసే ఆసనమే శవాసనం. దీనిని ‘అమృతాసనం ‘శాంతిఆసనం అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడానికి ఏకాగ్రత చాలా అవసరం. వేసే విధానం: నేలమీద వెల్లకిలా పడుకుని శరీరావయవాల బిగువ్ఞను సడలించి, చేతులు, కాళ్లనూ బారుగా చాచి తేలిక చేసుకోవాలి. చేతులను తొడప్రక్కగా ఉంచి రెండు కాళ్లను దగ్గరకు చేసుకోవాలి.

కళ్లు మూసుకుని, నిదానంగా గాలిని పీల్చుకోవాలి. ఈ సమయంలో దైవప్రార్థన ఏకాగ్రతను పెంపొందిస్తుంది. ఉపయోగాలు: ఈ ఆసనం వేయడం వలన శరీరం మొత్తం విశ్రాంతి పొందుతుంది. రక్తపోటు, అజీర్ణవ్యాధి వంటివి కూడా తగ్గిస్తుంది. ఆందోళనకరమైన పరిస్థితులలో మనసు కుదుటపడుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. వ్యాధులు నివారించబడి, జీర్ణశక్తి పెరుగుతుంది.