శరీరాకృతిని బట్టి నగలు
శరీరాకృతిని బట్టి నగలు
మన శరీరంలోని ఏ భాగాల్ని హైలైట్ చేయాలనుకుంటామో, ప్లేడౌన్ చేయాలనుకుంటామో దానిలో జ్యుయలరీ పాత్ర ప్రముఖమైంది. కొనేముందు మన శరీర ఆకృతిని దృష్టిలో ఉంచుకుని నగలు కొనాలి.
గుండ్రని ముఖం కలవారు, పొడవాటి డాంగ్లర్స్, చదరపు, దీర్ఘచతురస్రాకారపు ఇయర్రింగ్స్ పెట్టుకోవచ్చు. వీరు గుండ్రని చెవిరింగులు ధరిస్తే అంతగా నప్పదు. పొడుగ్గా ముఖం ఉంటే స్టడ్స్కానీ, షాండ్లియర్ కానీ గోళాకారం, త్రికోణం షేపులవి చెవికి పెట్టుకోవాలి. అండాకార ముఖం వారు (ఓవల్షేపు) ఎలాంటి నగలు, చెవిదిద్దులు పెట్టుకున్నా బాగుంటుంది. మరీ పొడవాటి జుంకీలు బాగుండవ్ఞ. పొడవ్ఞ మెడకి చిన్న నెక్లెసు బాగుంటుంది. హార్ట్ షేపు ముఖం ఉండదనుకోండి.
కానీ అలా ఉన్నవారు టియర్ డ్రాప్, షాండ్లియర్, గోళాకారం, త్రికోణం ఇయర్రింగ్స్ పెట్టాలి. పిరమిడ్ షేప్ చక్కగా నప్పుతాయి. మెళ్లో చిన్న గొలుసు వేసుకోవాలి. నలుచదరం, దీర్ఘచతురస్రాకారపు ముఖం వారు హూప్స్, పొడవాటి టియర్డ్రాప్స్, మల్టీ లేయర్డ్ డాంగలర్స్ ధరించాలి. చెవికి. డైమండ్ ఆకారం ముఖం వారు చిన్న వెడల్పు ఇయర్రింగ్స్ ధరించాలి. స్టడ్స్ బాగుంటాయి. పెద్ద చెవ్ఞలుంటే వ్రేలాడే డాంగ్లర్స్, టాప్స్ పెట్టాలి. చిన్న చెవ్ఞలకి జుంకీలు తగిలించాలి.
టాప్స్ పెట్టుకోకూడదు. మెడలావ్ఞగా ఉన్నవారు అతుకున్నట్లుగా నెక్లెసు ధరించరాదు. పొడుగ్గా ఉన్నవారు చిన్నచిన్న ముత్యాల దండ వేసుకోవాలి. పొడవాటి చేతివ్రేళ్లున్న వారు ఎలాంటి డిజైను ఉన్న ఉంగరం అయినా పెట్టుకోవచ్చు. పెద్దముక్కుకి చిన్న ముక్కెర, చిన్నముక్కుకి పెద్దది పెట్టాలి. పొట్టి స్త్రీలు సన్నని గాజులు, భారీ పొడుగు స్త్రీలు వెడల్పాటి గాజులు వేసుకోవాలి.