శరీరం బరువు తగ్గాలంటే!

FAT
Weight reduction

This slideshow requires JavaScript.

శరీరం బరువు తగ్గాలంటే!

వెయిట్‌ లాస్‌ సర్జరీ కేవలం కొన్ని కేసులలో మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఈ శస్త్ర చికిత్సను ఈ లక్షణాలు కలిగిన ప్రజలకు అవసరమని వైద్య నిపుణులు సూచిస్తారు. ఎ.మగవారిలో 100 పౌండ్లు కన్నా అధకంగా, స్త్రీలలో 80 పౌండ్ల కన్నా అధికంగా బరువు ఉంటే, బి. తక్కువ బీఎంఐ (35 నుంచి 40) ఉన్నప్పటికీ ఒబెసిటీ సంబంధిత అతి తీవ్రమైన ఆరోగ సమస్యలు అయినటువంటి గుండె జబ్బులు, సి. టైప్‌ 2 మధుమేహం, డి. అధిక కొలెస్ట్రాల్‌ లేదా తీవ్రమైన స్లీప్‌ ఆప్నియా వంటివి ఉన్నప్పుడు

డైట్‌, వ్యాయామాలు వంటి శస్త్ర చికిత్సేతర మార్గాల ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నించి విఫలమైన పరిస్థితులలో ఈ. వెయిట్‌లాస్‌ సర్జరీల వల్ల ఎదురయ్యే ప్రమాదాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటడంతో పాటుగా తగిన విధంగా ప్రేరణ పొందిన వారు. వెయిట్‌ లాస్‌ శస్త్ర చికిత్స ఏవిధంగా బరువు తగ్గడానికి ఉపయోగం ? వెయిట్‌లాస్‌కు సంబంధించి ప్రాథమికంగా రెండు లక్షణాలు ఉన్నాయి. అవి రిస్ట్రిక్టివ్‌ సర్జరీలు పనిచేస్తాయి. దీనివల్ల తీసుకునే ఘనాహార మొత్తంలో పరిమితి ఏర్పడుతుంది.సాధారణ జీర్ణాశయం దాదాపు మూడు పింట్ల ఆహారం నిల్ల ఉంచుతుంది.

వెయిట్‌లాస్‌ శస్త్ర చికిత్స తరువాత, జీర్ణాశయం కేవలం ఒక ఔన్స్‌ ఆహారం మాత్రమే నిల్వ ఉంచుతుంది. తరువాతి కాలంలో ఇది రెండు లేదా మూడు ఔన్సుల ఆహారం మాత్రమే నిల్వ చేయవచ్చు. మలబార్ప్టివ్‌ శస్త్ర చికిత్సలో జీర్ణప్రక్రియ స్వీకరించే ఆహారంలో మార్పు చేయడం ద్వారా పనిచేస్తుంది. ఈ తరహా వెయిట్‌లాస్‌ శస్త్ర చికిత్స అత్యంత క్లిష్టమైనది. ఈ శస్త్ర చికిత్సలో సర్జన్‌ ప్రేగులలో కొంత భాగం తొలగించి, ఆహారం జీర్ణం కావడానికి స్వల్ప మార్గాలను ఏర్పరుస్తారు. కొన్ని కేలరీలు శరీరంలో నేరుగా స్వీకరించబడతాయి. మలబ్సార్టివ్‌, రిస్ట్రిక్టివ్‌ సర్జరీల సమ్మేళనంలో కొద్దిపాటి ఉదర సంచిని సృష్టిస్తారు. ఇది మనం తీసుకునే ఆహారాన్ని నియంత్రిస్తుంది. వెయిట్‌లాస్‌ శస్త్రచికిత్సలలో లాభనష్టాలు ఏమిటి ? గ్యాస్ట్రిక్‌ బ్యాండింగ్‌ అనేది తరచుగా చిన్నకోత శస్త్రచికిత్సగానే ఉంటుంది.

సాధారణంగా చిన్నకొతతో ల్యాపరోస్కోపిక్‌ (చిన్న కెమెరా), ప్రత్యేకమైన ఇన్‌స్ట్రమెంట్‌తో దీనిని చేస్తారు. ఆ. జీర్ణాశయం లేదా ప్రేగులను కోయాల్సిన అవరం లేదు, సాధారణంగా గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ సర్జరీతో పోలిస్తే దీనిలో వేగంగా కోలుకుంటారు. శస్త్రచికిత్స ద్వారా బ్యాండ్‌ను తొలగిస్తే ఈ శస్త్ర చికిత్స ఉపసంహరించవచ్చు. వెయిట్‌లాస్‌, పౌష్టికాహార అవసరాలకు తగినట్లుగా వైద్కుని కార్యాలయంలోనే ఈ బ్యాండ్‌ను వదులు చేయడం లేదా టైట్‌ చేయడానికి సలైన్‌ సొల్యూషన్స్‌ను బ్యాండ్‌లో చొప్పిస్తారు.

దీనిని వదులు చేయడానికి సూది ద్వారా ఈ లిక్విడ్‌ను తొలగిస్తారు. ఉ. ప్రమాదకరమైన సమస్యలు ఈ చికిత్సలో సాధారణంగా కనిపించవు. కానీ గ్యాస్ట్రిక్‌ బ్యాండ్‌లు అనుకున్న ప్రదేశం నుంచి ఒక్కోసారి జారిపోవచ్చు. ఇలా జరిగినప్పుడు అదనంగా మరో శస్త్ర చికిత్స చేయాల్సి రావొచ్చు. నష్టాలు: గ్యాస్ట్రిక్‌ బైపాస్‌తో పోలిస్తే మీ వెయిట్‌ లాస్‌ కాస్త నెమ్మదిగా కావొచ్చు. ప్రతీ ఒక్కరికీ ఇలా జరుగుతుందని లేకపోయినప్పటికీ రమారమి 40 శాతం నుంచి 50 శాతం వరకూ మీ అదనపు బరువును కోల్పోవచ్చు. కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి కొంత బరువును పొందవచ్చు. ఈ తరహా సర్జరీలలో తిరిగి శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. బరువు నియంత్రించుకోవడానికి కొంత కష్టపడాల్సిన అవసరం ఉంటుందనీ,ఇందుకు వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు :

అతి కొద్ది పరిమాణంలో మాత్రమే ఆహారం తీసుకోవాలి. కొద్ది మొత్తంలో ఆహారం తీసుకోవడం కష్టమే కానీ, అది అవసరం. కొద్ది మొత్తంలో ఆహారాన్ని నెమ్మదిగా, పూర్తిగా నమిలి తినాలి. ప్రొటీన్‌ అధి కంగా తీసుకోవాలి. తీసుకునే ఆహారం ఎంత మొత్తమనేది లెక్కించి తీసుకోవాలి. చక్కటి పౌష్టికాహారం అనేది అత్యవసరం. అలాగే, మీరు సరైన పరిమాణంలో సప్లిమెంట్స్‌ను హెల్త్‌కేర్‌ ప్రొవైడర్‌ సూచించిన రీతిలో తీసుకోవాలి. ఎందుకంటే వెయిట్‌లాస్‌ సర్జరీ చేయించుకున్నప్పుడు తీవ్రంగా పౌష్టికాహార లోపం ఎదురు కావచ్చు.

డైటీషియన్‌ మీకు అవసరమైన డైట్‌ను రూపొందిస్తే న్యూట్రీషియన్‌ మీ అవసరాలకు తగినట్లుగా ప్లాన్‌ రూపొందిస్తారు. వ్యాయామం తరచూ చేయాలి. చాలా మంది అధిక బరువు కలిగిన ప్రజలు వ్యాయాయం చేయరు. కానీ బరువు మరలా పెరగకుండా ఉండేందుకు వ్యాయా మం చేయడం తప్పనిసరి. ఒకసారి బరువును కోల్పోవడం ప్రారంభిస్తే వ్యాయామం చేయడం సులభం. గణనీయంగా బరువు తగ్గడం అనేది చిన్న విషయం కాదు. నిజానికి ఈ ప్రభావాలు లోతైనవి, సుదూరమైనవి. కొన్నిసార్లు జీవితం సమస్యాత్మకమైనట్లుగా అనిపించవచ్చు. జీవనశైలి మార్పులను జీవితాంతం అనుసరించాల్సి ఉంటుంది. సౌకర్య వంతమైన ఫుడ్‌ కోరుకోవచ్చు…దాన్ని వదిలే యడం కష్టం కావొచ్చు. ఈ కష్టకాలంలో థెరపిస్ట్‌ సహాయపడవచ్చు. ఇప్పటికే వెయిట్‌లాస్‌ శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తులతో కూడిన సపోర్ట్‌ గ్రూపు గురించి వైద్యుడి సలహాలు తీసుకోవాలి. జీవితంలో మార్పులు చేసుకున్నట్లుగానే వెయిట్‌లాస్‌ కార్యక్రమంలో సహాయపడుతుంది. వెయిట్‌లాస్‌ సర్జరీకి ఎంత ఖర్చవుతుంది? బీమా కవరేజి లబిస్తుందా? లేదా అనేది శస్త్ర చికిత్స చేయించు కునే హాస్పిటల్‌ను బట్టి ఉంటుంది.

– డా.టి.వరుణ్‌రాజు

శస్త్రచికిత్స విభాగం అధిపతి