శత వసంతాల పార్టీ మిత్రులకోసం యాచిస్తోంది

MODI, PM
MODI, PM

భోపాల్‌ ర్యాలీలోప్రధానిమోడీ
భోపాల్‌: శతవసంతాల పార్టీ ఇపుడు భాగస్వాములకోసం యాచిస్తోందని, ఈ పార్టీ అధికారంలో ఉన్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద చల్లుతోందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. అంశాలపై చర్చకు రావడం కంటేబురద చల్లడం తేలిక అని అందుకే కాంగ్రెస్‌ పార్టీ ఆవైపు మొగ్గుచూపిస్తోందని అన్నారు. రాఫెల్‌ యుద్ధవిమానాల డీల్‌పై పదేపదే కాంగ్రెస్‌ విమర్శించడంపై ప్రధానిమోడీ కాగ్రెస్‌ విమర్శలను తిప్పికొట్టారు. ఎన్నికలకు వస్తున్న మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఇపుడు దేశం బయటినుంచి కూడా తమకు మద్దతు కావాలని కోరుకుంటున్నదని, దేశంలో మహాకూటమి విఫలం అయిన తర్వాత కాంగ్రెస్‌ ఇపుడు విదేశీ మద్దతును సమీకరిస్తోందని ఎద్దేవాచేసారు. అంతేకాకుండా పాకిస్తాన్‌ అంతర్గతశాఖ అంటేహోంశాఖ మంత్రి రెహమాన్‌ మాలిక్‌ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోనికి తీసుకున్న ప్రధానిమోడీ పరోక్షంగా రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. రాఫెల్‌ జెట్‌ కుంభకోణం సరైన రీతిలో బయటికి లాగితే భారత్‌లో రాహుల్‌ గాంధీ తదుపరి ప్రధానమంత్రి అవుతారని రెహమాన్‌మాలిక్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. అహంకారం పేరుకునిపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ 440 సీట్లనుంచి ఇపుడు 44సీట్లకు దిగజారిపోయిందని, ఇప్పటికీ సర్దుబాటుచేసుకునే ధోరణి ఎక్కడా కనిపించడంలేదన్నారు. 125 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీలో ఇపుడు మిగిలిందేమీ లేదని, సూక్ష్మదర్శినివేసి చూడాల్సి వస్తోందని మైక్రోస్కోపులో పెట్టినా ఆ పార్టీ కనిపించదని ఎద్దేవాచేసారు. ఇదే ర్యాలీలో బిజెపి ఛీఫ్‌ అమిత్‌షా, ఎంపిముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లు కూడాప్రసంగించారు. ఇపుడు కాంగ్రెస్‌ పార్టీ దుస్థితి ఎంత దిగజారిపోయిందంటే ఇపుడు ఆ పార్టీ చిన్నపార్టీలను కూటమిలోనికి రావాలని యాచించే స్థితికి జారిపోయిందని పేర్కొన్నారు. మిత్రులను సమీకరించుకోగలిగినా మహాకూటమి విజయవంతం కాబోదని, అందువల్లనే ఇపుడు విదేశీ మద్దతువైపు దృష్టిసారించారన్నారు. ఇపుడుదేశం బైట ఉన్న శక్తులే భారత్‌లో ఎవరు ప్రధాని కావాలన్నది నిర్ణయించేస్తున్నారని అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ మరింత నైతికంగా దెబ్బతిన్నదని అన్నారు. రాఫెల్‌ యుద్ధవిమానాలకొనుగోలు డీల్‌లో అవినీతి ఉందంటూ చేస్తున్న ఆరోపణలపై మోడి స్పందించారు. వారంతా ఇపుడుబురద చల్లుతున్నారని, అభివృద్ధిపై చర్చకంటే బురదచల్లడం సులువేనని అందుకే కాంగ్రెస్‌ బురదచల్లుతోందన్నారు. అంతకుముందు కూడా ఇదేధోరణితో ఉందన్నారు. వారు ఎంతగా బురద చల్లితే అంతగా బిజెపి కమలం వికసిస్తుందని అన్నారు. గడచినరెండుదశాబ్దాల్లో తనను అప్రతిష్టపాలుచేసే చర్యలు ఎక్కడా కార్యరూపంసైతం దాల్చలేకపోయాయయన్నారు. 2001లో తాను రాజకీయాల్లోనికి వచ్చినప్పటినుంచి కాంగ్రెస్‌ పార్టీ తనపూర్తి బలాన్ని ఉపయోగించి తనను విమర్శిస్తూ వచ్చిందని, డిక్షనరీలో ఏ ఒక్క పదం కూడా మిగలకుండా తనను దూషించారని అన్నారు. అప్పటినుంచి తమ పార్టీ కమలం మరింతగా వికసించిందని అన్నారు.అభివృదికి సంబంధించి చర్చలో పాల్గొనాలని, అభివృద్ధిపై చర్చలో వ్యతిరేకించండని ఆయన సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ పార్టీ ఇపుడు దేశానికి భారంగా పరిణమించిందని, బిజెపిలోని ప్రతి కార్యకర్త ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి కాంగ్రెస్‌ పార్టీనుంచి దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని షురూచేసినట్లుగా తలపిస్తున్న ఈ ర్యాలీలో ప్రధాన మంత్రి మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు సమాజాన్ని చీడపురుగుల్లా తొలిచేసాయని, ఈ వోటుబ్యాంకురాజకీయం నుంచి దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. సమాజంలోని ఒకవర్గం ప్రజలను వినియోగించుకుని ఎన్నికల్లో విజయం కోసం పనిచేస్తారని, ఇతరుల సంక్షేమం కోసం ఈ పార్టీ ఎప్పుడూ పనిచేయదని, కేవలం వారి కుర్చీని కాపాడుకునేందుకు మాత్రమే ఆలోచిస్తాయని అన్నారు. విధ్వంసంతో ఈ పార్టీలు దేశాన్ని విభజిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇక ట్రిపుల్‌ తలాక్‌పై మాట్లాడుతూ ఇస్లామిక్‌ దేశాల్లోకూడా ఈ దురాచారాన్ని కొనసాగించడంలేదని, అనుమతించడంలేదని అన్నారు. ఒక మహిళ నేతృత్వం వహిస్తున్న పార్టీలో ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడంలేదన్నారు. ఇదే వోటుబ్యాంకు రాజకీయం అని ఆయన వర్ణిఇంచారు. 70ఏళ్లుగా ఓటుబ్యాంకు రాజకీయాలు, విభజనరాజకీయాలు చేస్తున్న పార్టీలను మట్టికరిపించాల్సిన బాధ్యత బిజెపి కార్యకర్తలదేనని ఆయన అన్నారు. ఎన్‌డిఎప్రభుత్వం అందరికీ సామాజికన్యాయం కావాలని కోరుతుందని, సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ అన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మహాకూటమిగా అన్ని ప్రతిపక్షాలు ఏర్పడ్డాయనికేవలం ఓటమి పాలవుతాయన్న భయంతోనే కూటమి కట్టారని పేర్కొన్నారు. ఒక చా§్‌ువాలా, లేదా ఒక నిరుపేత తల్లికుమారుడు శివరాజ్‌ వంటివారు, ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాధ్‌ వంటి వారు అధికారంలోనికి రావడాన్ని కాంగ్రెస్‌ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నదని అన్నారు. బిజెపి ప్రభుత్వాల్లోప్రతిచోటా అడ్డంకులు సృష్టించారని బిజెపి ప్రభుత్వాలకు ప్రజలు తిరస్కరించిన తర్వాత వారు సొంత అభివృద్ధి మొదలుపెడతారని ఆరోపించారు. ఇపుడు వారికి గుణపాఠం చెప్పే తరుణం వచ్చిందని మోడీ స్పష్టంచేసారు.