శత్రువులను సైతం క్షమించడమే క్రీస్తుతత్వం

Jagan
Jagan

హైదరాబాద్‌: క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల క్రైస్తవులందరికి వైఎస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ పండగను ఘనంగా జరుపుకోవాలని ఆకాక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమను, శాంతి యువత సహజీవనం, సహనం, శత్రువుల పట్ల క్షమాగుణం ఇవన్ని మానవాళికి క్రీస్తు తన జీవితం ద్వారా ఇచ్చిన మహోన్నత సందేశాలని ఆయన గుర్తుచేశారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరిని సన్మార్గంలో నడిపిస్తాయని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.