శత్రుఘ్న సిన్హాకు బిజెపి నేత సవాల్‌

Shatrughan Sinha
Shatrughan Sinha

పట్నా: బిజెపి ఎంపి శత్రుఘ్న సిన్హా పై బిజెపి సీనియర్‌నేత, బిహార్‌ ఉపముఖ్యమంత్రి సుశిల్‌ కుమార్‌ మోడి ఇటివల ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ శత్రుఘ్న సిన్హా తీరుపై స్పందించారు. శతుఘ్న సిన్హా నావు ఆదర్శమైన వ్యక్తి కానీ బిజెపి పట్ల ఆయన ప్రవర్తించే తీరు బాగోలేదు. ఆయన లాలూ ప్రసాద్‌యాదవ్‌ను కవడం, లాలూ కుమారుడు బీహార్‌ సిఎం అవుతాడని అంచనా వేయడం సరికాదు. ఆయనకు అంతగా నచ్చకపోతే పార్టీని వదిలి వెళ్లిపోవచ్చుగ అని సుశిల్‌ మోదీ అన్నారు. బిజెపి  నేతల వల్లే గత ఎన్నికల్లో శత్రుఘ్న సిన్హా గెలిచారని, ధైర్యముంటే ఈసారి ఎన్నికల్లో ఆయన తన పాపులారిటీతో విజయం సాధించాలని సుశిల్‌ మోదీ సవాల్‌ విసిరారు.