శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌

Rahul gandhi
Rahul gandhi

నేడు రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌కు రానున్న విషయం విదితం. కాగా కొద్దీసేపటి క్రితం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్‌ శ్రేణులు సాదర స్వాగతం పలికారు. రాహుల్‌ మొదటగా మహిళసంఘాలతో ముఖాముఖి చర్చలో పాల్గోంటారు. ఆయన రాక సందర్భంగా శంషాబాద్‌ నుంచి నాల్గో విడత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అనంతరం శేరిలింగంపల్లిలో బహిరంగసభలో పాల్గోంటారు. రాహుల్‌పర్యటన కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటనలో మీడియాను అనుమతించి, రాహుల్‌ పర్యటనలో ఆంక్షలు విధించడంపూ నేతలు ఆగ్రహాం చెందారు. వివిఐపి ప్రవేశద్వారానికి 2కి.మీ.ల దూరంలోఒ మీడియాను పోలీసులు ఆపేశారు. ఐతే పోలీసులు ర్యాలీ వద్దంటూ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు.