శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో చిరుత కలకలం
leopard
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి శంషాబ్ ఎయిర్‌పోర్ట్‌లోని రన్ వేపై చిరుత సంచరింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 10 నిమిషాల పాటు ఎయిర్పోర్ట్ రన్‌వేపై తిరగాడిన చిరుత.. ఆ తర్వాత రషీద్‌గూడ వైపు గోడ దూకి వెళ్లింది. ఎయిర్పోర్ట్ రన్‌వే పై చిరుత సంచారంతో అప్రమత్తమైన పొలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ ఆధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
చిరుత సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/