శంషాబాద్‌ దశాబ్ధి ఉత్సవాలకు సియం

KCR ATTEND TO SAMSHABAD DECADE CELEBS
KCR ATTEND TO SAMSHABAD DECADE CELEBS

హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం దశాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సియం కేసిఆర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు సియం శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటిఆర్‌, ఎమ్మెల్యేలు, పలువురు పాల్గొన్నారు.