శంకర్‌ హీరోగా ‘శంభో శంకర’

shanker
shanker

ఆర్‌ ఆర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌కె పిక్చర్స్‌ సమర్పణలో శ్రీధర్‌ ఎస్‌. దర్శకుడిగా శంకర్‌ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న ఓచిత్రానికి మహా శివరాత్రి సందర్భంగా శంభో శంకర అనేపేరును టైటిల్‌గా ఖరారుచేశారు. ఈసందర్భంగా చిత్ర దర్శఖుడు శ్రీధర్‌ మాట్లాడుతూ. తన కథను నన్ను నమ్మి తొలి అవకాశమిచ్చిన నా ప్రియమిత్రుడు శంకర్‌కు ముందుగా తన కృతజ్ఞతలని తెలిపారు. మా ఇద్దర్నీ నమ్మి నిర్మాతలుగా ముందుకు వచ్చిన వై. రమణారెడ్డి, సురేష్‌ కొండేటికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే సినిమాకు ప్రాణం పెట్టి సంగీతాన్ని అందిస్తున్నసాయికార్తీక్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హీరోశంకర్‌ మాట్లాడుతూ, నేను హీరోగా పరిచయం కావటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఎన్నో కథలు విన్న తర్వాత నేను హీరోగా ఈ కథ అయితే బాగుంటుందనే ఉద్ధేశ్యంతో చేస్తున్న చిత్రమిదని అన్నారు. నిర్మాత రమణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు డెబ్బై శాతం షూటింగ్‌తోపాటు , ఒక భారీ సెట్‌, అద్భుతంగా హీరో ఇంట్రడక్షన్‌ పాటను చిత్రీకరించామన్నారు. మరో నిర్మాత కొండేటి సురేష్‌ సహకారంతో అనుకున్నది అనుకున్నట్టుగా షూటింగ్‌ పూర్తిచేయగలుగామన్నారు. మరో నిర్మాత ఎస్‌కె పిక్చర్స్‌ అధినేత సురేష్‌ కొండేటి మాట్లాడుతూ, మంచి కథతో నిర్మిస్తున్న అద్భుతమైన చిత్రమన్నారు. హీరో శంకర్‌, మేకింగ్‌ పరంగా హై టెక్నికల్‌ వాల్యూస్‌తో తెరకెక్కిస్తున్నామన్నారు. నెలాఖరుకల్లా షూటింగ్‌ , మార్చి నెలలో పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు పూర్తిచేసి వేసవి కానుకగా విడుదల చేయటానికి సన్నాహాలుచేస్తున్నామన్నారు. శంకర్‌ సరసన కారుణ్య హీరోయిన్‌గా నటిస్తోంది.