వ‌ల‌స బిజెపి నేత‌ల‌తోనే పోల‌వ‌రానికి అడ్డంకులుః అయ్య‌న్న పాత్రుడు

ayyanna patrudu
ayyanna patrudu

అమ‌రావ‌తిః బీజేపీలోని కొందరు వ‌ల‌స నేత‌ల‌ వల్లే పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు వస్తున్నాయని ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు వంటి బీజేపీ నేతలు పోలవరం ప్రాజెక్టుకి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ డూప్లికేట్ బీజేపీ నేతల తీరుతోనే సమస్యలు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఆది నుంచీ బీజేపీతోనే ఉండి ఎదిగిన అసలైన ఆ పార్టీ నేతలు రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారని మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామని ఆయన స్పష్టం చేశారు