వ‌రంగ‌ల్‌లో పేలుడు ఘటనపై కోదండరాం దిగ్భ్రాంతి

Kodanda ram
Kodanda ram

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా కోటిలింగాల వద్ద బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 11 మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పేలుడు ఘటనలో 11 మంది మృతి చెందడం బాధాకరమనీ, ప్రమాదంలో గాయపడిన వారికి సహాయక చర్యలు అందించాలని స్థానిక జన సమితి నాయకులకు ఆదేశం ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగకుండా ప్రభుత్వం తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.