వ‌చ్చే ఏడాది నుండి తెలుగు త‌ప్ప‌నిస‌రి: సియం

telugu medium students
telugu medium students

అమరావతి: మన ఉనికిని కాపాడే భాషను మర్చిపోకూడదని, అందరూ కచ్చితంగా తెలుగు చదవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వచ్చే సంవత్సరం నుంచి అన్ని విద్యాసంస్థల్లో తెలుగు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఇందుకు అందరూ సహకరిస్తారని సియం ఆశిస్తున్నామన్నారు . విజయవాడలో నిర్వహించిన డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చదువు వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఏపీని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమన్నారు. అమ్మలను గౌరవించేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటిన వసంత పంచమినాడు ‘అమ్మకు వందనం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు.