వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ నాటికి ఇంటింటికి ఇంట‌ర్నెట్ అందించాలి..

TS Minister KTR
TS Minister KTR

హైదరాబాద్: ఐటీ, పరిశ్ర‌మల శాఖ మంత్రి కెటిఆర్ బుధ‌వారం ఐటీ, ప‌రిశ్ర‌మల శాఖ‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఫార్మా భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఇంటింటికి ఇంటర్నెట్ అందజేయాలని సూచించారు. కేంద్రం భారత్ నెట్ కింద అందిస్తున్న నిధులతో కలిపి వచ్చేఏడాది డిసెంబర్ నాటికి ఫైబర్ గ్రిడ్‌ను పూర్తి చేయాలని అన్నారు. విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు మంజూరైన రూ.560 కోట్ల రుణం పత్రాలను విజయబ్యాంక్ డిప్యూటీ జీఎం సత్యానారాయణరాజు మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.