వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెజ‌స ఒంట‌రిగా పోటీః కోదండ‌రాం

Kodanda ram
Kodanda ram

వచ్చే సార్వ‌త్రిక ఎన్నికల్లో తెలంగాణ జనసమితి ఒంటరిగా పోటీ చేస్తుందని తెలంగాణ జనసమితి నేత కోదండరామ్ అన్నారు. వరంగల్ జిల్లాలో టీజేఎస్ రాజకీయ శిక్షణా తరగతులకు కోదండరామ్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజకీయం వ్యాపారం కాకూడదని, ప్రజలకు సేవ చేసేలా ఉండాలన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సమస్యలపై ఈనెల 30న సడక్ బంద్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఖమ్మం నుంచి కరీంనగర్ వరకు సడక్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.