వ‌చ్చే ఎన్నిక‌ల్లో వంద‌కు పైగా స్థానాలు

TS CM KCR-1
K.Chandrasekhar rao

హైద‌రాబాద్ఃముంద‌స్తు ఎన్నికలపై ఇప్పటికే ఆరు సర్వేలు చేయించానని, వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం, ప్రగతిభవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ముందస్తు ఎన్నికలు అవ్వదని, ఇప్పటికే ఎన్నికల సమయంలోకి వచ్చామని అన్నారు. నిర్ణీత సమయానికి ఆర్నెల్ల ముందు జరిగే ఎన్నికలు ముందస్తు ఎన్నికలు అవవని అభిప్రాయపడ్డారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై కేసీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి ఏర్పాటులో తన ప్రయత్నం ఆగదని చెప్పారు.